తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan) స్పష్టం చేశారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తానని చెప్పారు. ‘‘నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా ఉంటున్నా. ప్రధాని మోదీ, రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నా. ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. ఇందుకోసం దిల్లీ వెళ్లలేదు.. ఎవరినీ రిక్వెస్ట్ కూడా చేయలేదు. వరద బాధితులను పరామర్శించేందుకు తూత్తుకుడి వెళ్లి వచ్చా’’ అని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –