బిహార్‌లోని సీవాన్ జిల్లాలో అరుదైన జాతికి చెందిన గుడ్లగూబలు నాగుపాములా బుసకొడుతున్నాయి. ఈ వింత గుడ్లగూబలను చూసేందుకు జనం ఎగబడ్డారు. విస్వార్ గ్రామానికి చెందిన మనన్‌సింగ్ ఇంట్లో ఓ గది చాలాకాలంగా మూసి ఉంది. ఇటీవల మనన్‌సింగ్ ఆ గది తలుపులు తెరిచేందుకు వెళ్లాడు. లోపలి నుంచి పాము బుసలు కొడుతున్న శబ్దం అతడికి వినిపించింది. దీంతో పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు. వచ్చిన వ్యక్తి గది లోపలికి వెళ్లి చూడగా అక్కడ పాము లేదు. పాములా బుసలు కొడుతున్న వింత గుడ్లగూబలను చూసి ఆ వ్యక్తి విస్తుపోయాడు. తెలుపు రంగులో నల్లకళ్లతో ఉన్న ఈ గుడ్లగూబలను చూసిన స్థానికులు రామాయణంలోని జటాయువు పక్షితో పోలుస్తున్నారు. కొందరు వాటికి ఆహారం కూడా తినిపించారు. గుడ్లగూబలను పరిశీలించిన అటవీశాఖ సిబ్బంది అమెరికాలో ఉండే అరుదైన మంచు గుడ్లగూబలుగా గుర్తించారు. అనంతరం వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.
👉 – Please join our whatsapp channel here –