Videos

సలార్‌-2 నుంచి అప్‌డేట్‌

సలార్‌-2 నుంచి అప్‌డేట్‌

కేజీఎఫ్‌ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్‌ ఒకరు.. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన యాక్టర్‌ ఇంకొకరు.. వీళ్లిద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల మోత మోగాల్సిందే! ప్రభాస్‌ కటౌట్‌కి.. ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కి ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే! సలార్‌ సినిమా విడుదలకు ముందు అందరికీ ఇదే అనిపించింది. అన్నట్టుగానే సలార్‌ పార్ట్‌-1 సీజ్‌ఫైర్‌ విడుదల తర్వాత బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపుతోంది. ఈ సినిమా చివరలోనే సలార్‌-2 గురించి అనౌన్స్‌ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్‌ పార్ట్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో హోంబలే ఫిలింస్‌ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చింది.

సలార్‌-2 కి సంబంధించిన డైలాగ్‌ ప్రోమోను వదిలింది. శౌర్యాంగపర్వంలో ఎలాంటి అంశాలు ఉండొచ్చనే విషయాలపై హింట్‌ ఇస్తూ ఒక వీడియోను కాసేపటి క్రితం విడుదల చేసింది. అందులో ‘ ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సర్‌ యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఇంకోపక్క వేలమంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ దేవా.. అదే కుర్చీని వరదకు ఇస్తానని మాటిచ్చాడు. కానీ.. దాని మీద కూర్చునే హక్కు దేవాది.’ అంటూ సాగిన డైలాగ్‌ ప్రోమో అదిరిపోయింది. ఖాన్సర్‌ కుర్చీ మీద దేవా కూర్చుంటాడా? ఇచ్చిన మాట కోసం వరద వెనుక నిలబడతాడా? అనే సందేహంతో పార్ట్‌2పై ఈ ప్రోమో క్యూరియాసిటీని పెంచేసింది. 34 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z