తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సంక్రాంతి సినిమాల గురించి చర్చ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి అరడజన్ సినిమాలు మేము అంటే మేము అంటూ పోటీ పడుతున్నాయి. అందులో అన్నీ కూడా కచ్చితంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో ఎవరు ఎవరి కోసం త్యాగం చేసేలా కూడా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఎవరైనా సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటే వాళ్లకు సపరేట్‌గా సోలో డేట్ వచ్చేలా ప్లాన్ చేస్తామని చెప్పినా ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్క నిర్మాత కూడా తమ సినిమాను వాయిదా వేసుకుంటామంటూ ముందుకు రాలేదు. అంటే సంక్రాంతికి రావాలని అందరూ ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యారో అర్థం అవుతుంది.
పైగా పండక్కి అందరూ స్టార్ హీరోలే వస్తున్నారు. మహేశ్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా ఇలా అందరి వెనుక సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న సినిమా హనుమాన్ మాత్రమే. అందుకే అందరూ దాన్నే టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. జనవరి 12న ఈ సినిమా విడుదల చేస్తామని ఎప్పుడో ఆర్నెల్ల కింద అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అయితే హనుమాన్ అనౌన్స్ చేసిన రోజే గుంటూరు కారం కూడా వస్తుంది. ఆ తర్వాత రోజు ఈగల్, సైంధవ్ సినిమాలు వస్తున్నాయి. నా సామిరంగా కూడా ఆ రెండు మూడు రోజుల్లోనే రాబోతుంది.
దాంతో మిగిలిన నిర్మాతలు అందరూ హనుమాన్ ప్రొడ్యూసర్‌పై ఒత్తిడి పెడుతున్నారు. మీ సినిమాను వాయిదా వేసుకోవాలని బెదిరిస్తున్నారని ప్రశాంత్ వర్మ ఏకంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపుతుంది. సంక్రాంతి సినిమాలలో అందరికంటే ముందు సెన్సార్ పూర్తి చేసుకుంది కూడా హనుమాన్ సినిమానే. కచ్చితంగా అనుకున్న తేదీకి తమ సినిమాను విడుదల చేస్తాము అంటున్నారు దర్శక నిర్మాతలు. మిగిలిన భాషల్లో ఈ సినిమాకు డిజిటల్, శాటిలైట్ అగ్రిమెంట్స్ పూర్తి కావడంతో చివరి నిమిషంలో రిలీజ్ డేట్ మార్చడం అసాధ్యం. అందుకే తెలుగు మార్కెట్ లైట్ తీసుకున్నా కూడా మిగిలిన ఇండస్ట్రీలపై నమ్మకం పెట్టుకున్నారు హనుమాన్ దర్శక నిర్మాతలు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో హనుమాన్ సినిమాకు 200 నుంచి 350 థియేటర్ల కంటే ఎక్కువ రావు అనేది ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మొదటిరోజు గుంటూరు కారం.. ఆ తర్వాత రోజు ఈగల్, సైంధవ్, నా సామిరంగా లాంటి సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది. అయితే తమ సినిమాను ఓపెనింగ్స్ కోసం కాదు లాంగ్ రన్ కోసం విడుదల చేస్తున్నామని చెప్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఎలా చూసుకున్నా కూడా తమ సినిమాను వాయిదా వేసుకోవాలని కొందరు బెదిరిస్తున్నారు అంటూ ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయిప్పుడు.
👉 – Please join our whatsapp channel here –