NRI-NRT

ప్రముఖ నాట్యగురువు సుమతీ కౌశల్ కన్నుమూత

Noted Dancer Sumathy Kaushal Passes Away In California

కాలిఫోర్నియాలో నివసిస్తున్న ప్రముఖ నాట్యగురువు, నాట్య కళాకారిణి సుమతీ కౌశల్ మంగళవారం రాత్రి 8:30గంటల ప్రాంతంలో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె కూచిపూడిని వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వేదాంతం జగన్నాధ శర్మ, చింతా కృష్ణమూర్తి, వేదాంతం సత్యనారాయణ శర్మ వద్ద, భరతనాట్యాన్ని కె.జె.సరస, కళ్యాణం పిళ్లై వద్ద, ఒడిస్సీని పంజక్ చరణ్ దాస్ వద్ద అభ్యసించారు. అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఆమెకు పెద్ద శిష్య బృందం ఉంది. ఆమె మృతి పట్ల పలువురు కళకారులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. ప్రముఖ సినీనటి భానుప్రియ సుమతీ కౌశల్ కోడలు.