Devotional

2023లో శ్రీవారిని దర్శించుకున్న 2.52 కోట్ల మంది భక్తులు

2023లో శ్రీవారిని దర్శించుకున్న 2.52 కోట్ల మంది భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజులపాటు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనం పరిసమాప్తమైంది. గతేడాది డిసెంబరు 23 నుంచి ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం సోమవారం రాత్రి ముగిసింది. అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాల్ని మూసివేశారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు సోమవారం సాయంత్రానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుపతిలో సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు మంగళవారం నుంచి దర్శనం కల్పించనున్నారు.

2023లో 2.52 కోట్ల మంది…
శ్రీవారిని 2023లో 2.52 కోట్ల మంది దర్శించుకున్నారు. రూ.1,398 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కును దాటింది. జులైలో అత్యధికంగా రూ.129 కోట్లు, నవంబరులో అత్యల్పంగా రూ.108 కోట్లు లభించాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z