ScienceAndTech

లొకేషన్ షేరింగ్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్

లొకేషన్ షేరింగ్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్

రూట్‌ తెలుసుకోవటం, షార్ట్‌కట్‌ల మార్గాలతో పాటూ రియల్‌టైమ్‌ లొకేషన్‌ షేరింగ్‌ వంటి సదుపాయాలన్ని గూగుల్‌ మ్యాప్స్‌ అందిస్తోంది. అయితే ఈ రియల్‌టైమ్‌ లొకేషన్‌ ఇతరులకు పంపించాలంటే కచ్చితంగా వాట్సాప్‌ లాంటి మరో యాప్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెడుతూ గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో ఏ ఇతర యాప్స్‌తో పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్‌ ద్వారానే రియల్‌టైమ్‌ లొకేషన్‌ పంపొచ్చు.

వాట్సాప్‌ ద్వారా రియల్‌టైమ్‌ మెసేజ్‌ పంపే సదుపాయం ఉన్నప్పటికీ 15 నిమిషాలు, గంట, 8 గంటలు ఇలా లిమిటెడ్‌ ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. ఈ కొత్త ఫీచర్‌ సాయంతో పంపే లొకేషన్‌కు లిమిట్‌ ఉండదు. ఎంత సేపైనా అది ఆన్‌లోనే ఉంటుంది. మనం వద్దనుకున్నప్పుడు వెంటనే షేరింగ్‌ ఆపొచ్చు.  ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగిస్తున్నా చాలా మంది వాట్సాప్‌ లాంటి యాప్స్‌ని వినియోగించరు. అలాంటి వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్‌ని వినియోగించాలంటే మీరు లొకేషన్‌ పంపాలనుకున్న వ్యక్తి కూడా గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యిండాలి.

ఎలా వినియోగించాలంటే..దీనికోసం గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వాలి. పైన కుడివైపున్న ఫ్రొఫైల్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేసి అందులో ‘Location Sharing’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘New Share’ పై క్లిక్‌ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా ‘Until you turn this off’ ఆప్షన్‌ ఎంచుకొని కాంటాక్ట్‌ సెలెక్ట్‌ చేసుకొని మెసేజ్‌ సెండ్‌ చేయాలి. షేరింగ్‌ నిలిపివేయాలనుకున్నప్పుడు.. ప్రొఫైల్‌ ఖాతాలోకి వచ్చి ‘Stop sharing option’ పై క్లిక్‌ చేస్తే సరి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z