బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
భవానీ దీక్షల విరమణకు వచ్చే భక్తులకు విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో హోల్డింగ్ ఏరియా, బస్టాండ్, కెనాల్ రోడ్, పున్నమిఘాట్, భవానీ ఘాట్, సివిఆర్ ఫ్లై ఓవర్ కింద, కొండ కింద, కొండ పైన తదితర ప్రదేశాలలో 200 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. బందోబస్తుకు వస్తున్న పోలీసులకు వాళ్ళ విశ్రాంతి ప్రదేశంలో 100 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇదే కాక.. భక్తుల దాహం తీర్చేందుకు 8 ప్రదేశాలలో 16 లక్షలకు పైగా త్రాగునీటి వాటర్ ప్యాకెట్లు, భక్తుల సౌకర్యార్థం విడిగా నీళ్లను స్టీల్ కంటైనలలో ఏర్పాటు చేశారు. నిరంతరం మెషిన్లతో మూడు షిఫ్ట్ లలో పారిశుధ్య నిర్వహణ చేపట్టనున్నారు. భక్తులు విడిచే బట్టలను కన్వీయర్ బెల్ట్ ద్వారా నిరంతరం ట్రాక్టర్లలో తరలింపు ప్రక్రియను చేపట్టనున్నారు.
👉 – Please join our whatsapp channel here –