DailyDose

హైదరాబాద్‌లో కిక్కిరిసిన పెట్రోల్ బంకులు

హైదరాబాద్‌లో కిక్కిరిసిన పెట్రోల్ బంకులు

హిట్ అండ్ రన్ యాక్ట్ పుణ్యామా అని రెండో రోజు పెట్రోల్ బంకుల దగ్గర వెహికిల్స్ రద్దీ కొనసాగుతుంది. నిన్న ఒక్కసారిగా వాహనదారులు బంకుల దగ్గరకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో బంకుల దగ్గర సరఫరా కొనసాగుతుంది. హైదరాబాద్‌ నగరంలోని పలు పెట్రోల్‌ బంక్‌ల వద్ద వెహికిల్స్ పెద్ద ఎత్తున బారులు తీరారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ దొరుకుతుందో లేదోనని వాహనదారులు ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాము నుంచే బంకుల దగ్గరకు చేరుకుంటున్నారు. బంక్‌లు ఇంకా ఓపెన్ కాకముందే వెహికిల్స్ ను వరుసగా కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి ఉన్నారు. ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత కొనసాగుతుంది.

అయితే, జనవరి 1 నుంచి ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు నిరసనకు దిగడంతో బంకులకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా ఆగిపోయింది. ఇప్పటికే నగరంలో చాలా వరకు పెట్రోల్‌ బంకులు క్లోజ్ చేశారు. బంకుల ముందు నో స్టాక్‌ బోర్డులు కనబడుతున్నాయి. అయితే, తెరచి ఉన్న కొన్ని పెట్రోల్‌ బంకుల ముందు హైదరాబాద్‌లో వెహికిల్స్ పెట్రోల్‌ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్‌ బంకులు మూసి వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్‌ బంకుల ముందు వాహనదారులు క్యాన్‌లతో బారులు తీరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కొన్ని చోట్ల పెట్రోల్‌ బంకుల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z