కడపలో పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం గత 10 రోజులగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మున్సిపల్ అధికారులు చెత్తవాహనాలను బయటకు తీసుకుని వెళ్తుండగా కార్మికులు వారిని అడ్డుకున్నారు. సమ్మె చేస్తున్న సమయంలో వాహనాలను ఎలా బయటకు తీసుకువెళ్తారంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పారిశుద్ధ్య కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కార్మికులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు రవి మాట్లాడుతూ న్యాయమైన సమస్యల సాధనకు తాము సమ్మె చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం తగదని ఆవేదనం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని హెచ్చరించారు.
👉 – Please join our whatsapp channel here –