విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలంటూ కార్యాలయం ముట్టడికి డీవైఎఫ్ఐ కార్యకర్తలు, నిరుద్యోగులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. అనంతరం ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని ఠాణాకు తరలించారు.
👉 – Please join our whatsapp channel here –