వ్యూహం సినిమాపై తెలంగాణ హై కోర్టులో విచారణ కొనసాగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ అప్పీల్ చేసింది. సినిమా రిలీజ్ ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందనీ వాదించారు. అయితే, సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వం వాదనలు కొనసాగాయి. ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల చేయొద్దని కొద్ది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11కు బదులు 8 వ తేదీన విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ కోరింది. మెరిట్స్ ఆధారంగా ఈనెల 8 న సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్ కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక, వ్యూహం సినిమా యూనిట్ వేసిన అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్పోస్ చేసింది.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. సీఎం జగన్ కు అనుకూలంగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘వ్యూహం’ చిత్రాన్ని వర్మ తెరకెక్కించారు. అయితే, చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ పిటిషన్ ను విచారణ చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
👉 – Please join our whatsapp channel here –