Politics

చంద్రబాబుపై జగన్ విమర్శలు

చంద్రబాబును అవినీతిపరుడిగా నిర్ధారించిన కోర్టు

బుధవారం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబు అవినీతిపరుడంటూ సీఎం తీర్పు కూడా చెప్పేశారు. ‘‘చంద్రబాబు అవినీతిపరుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఐటీ, ఈడీలు సమన్లు ఇస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి చంద్రబాబును జైల్లో పెట్టాయి. జైలు దగ్గరకు వెళ్లి దత్తపుత్రుడు దత్తతండ్రిని పరామర్శిస్తాడు. అంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఆ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్‌ ఇస్తారు. మన ప్రభుత్వానికి వచ్చేసరికి అవినీతి జరగకపోయినా అభాండాలు వేస్తున్నారు. చంద్రబాబు అవినీతి చేసినా ఆయన నోరు ఎందుకు మెదపరంటే దానిలో ఈయన కూడా భాగస్వామి కాబట్టి’’ అంటూ సీఎం చెప్పుకొచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z