Videos

‘శశివదనే’ టీజ‌ర్

‘శశివదనే’ టీజ‌ర్

పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘శశివదనే. కోమలీ ప్రసాద్ క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కుతుండ‌గా.. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్‌లుక్‌తో పాటు మ్యూజిక‌ల్ అప్‌డేట్ ఇవ్వ‌గా ప్రేక్ష‌కుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్ గ‌మ‌నిస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ల‌వ్ స్టోరీ అని తెలుస్తుంది. హీరో – హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా టీజర్ ఎండింగ్‌లో రక్షిత్ లుక్ చూస్తుంటే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2000 నుంచి 2010 బ్యాక్‌డ్రాప్‌లో ఉండ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌రోవైపు శశివదనే విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్‌.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z