Politics

పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన రేవంత్‌

పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన సీఎం.. రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను సీఎంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి కలిశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z