Politics

కేశినేనికి షాక్ ఇచ్చిన టీడీపీ

కేశినేనికి షాక్ ఇచ్చిన టీడీపీ

రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌ను వేరే వ్యక్తికి ఇవ్వాలని తెదేపా(TDP) నిర్ణయించింది. ప్రస్తుత ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)కి ఆ సమాచారాన్ని పార్టీ అధిష్ఠానం చేరవేసింది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు.

‘‘అందరికీ నమస్కారం. గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నన్ను కలిశారు. ఈనెల 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినందున ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్లు వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని.. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. అధినేత ఆజ్ఞలను తు.చ. తప్పకుండా శిరసావహిస్తానని నేను వారికి హామీ ఇచ్చా’’ అని కేశినేని నాని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z