నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. రైల్వేలో వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF)లో సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎగ్జిక్యూటివ్), కానిస్టేబుల్స్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు RPF/RPSFలో 2,000 కానిస్టేబుల్ పోస్టులు, 250 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం వేకెన్సీల్లో 10 శాతం ఖాళీలను మాజీ సైనికులకు, 15 శాతం మహిళా అభ్యర్థులకు కేటాయించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్వరలో ప్రారంభమవుతుంది.. దీని గురించి పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నారు..
అర్హతలు..
కానిస్టేబుల్ ఉద్యోగానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు కాగా, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి 20 సంవత్సరాలు. రెండు పోస్టులకు అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది. RPF ఎస్సై పోస్టులకు అప్లై చేసేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.. లేదా పదో తరగతి పాసై ఉండాలి..
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం నెలకు సుమారు రూ. 26,000 నుంచి 32,000 వరకు ఉంటుంది. RPF సబ్ ఇన్‌స్పెక్టర్ బేసిక్ పే రూ.35,400. అన్ని బెనిఫిట్స్ కలిపి వీరి జీతం రూ. 43,000 నుంచి రూ. 52,000 వరకు ఉంటుంది..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
*. ముందుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ rpf.indianrailways.gov.in ఓపెప్ చేయండి.
*. వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ డీటేల్స్ అందించి రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి.
*. మీ ఇమెయిల్ అడ్రస్‌కు లాగిన్ ID, పాస్‌వర్డ్ వస్తుంది. అకౌంట్‌కు లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫారమ్‌ను యాక్సెస్ చేయండి.
*. ఫారమ్‌లో అడిగిన వివరాలను నింపండి. మీ ఫోటోగ్రాఫ్, సంతకం, అవసరమైన ఇతర సర్టిఫికెట్ల స్కాన్డ్ కాపీస్ అప్‌లోడ్ చేయండి.
*. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.
ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ లో తెలుసుకోవాలి..
👉 – Please join our whatsapp channel here –