ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. అన్ని పార్టీలో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. ఇప్పటికే పలు అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య.. ఈ సారి రాసిన బహిరంగ లేఖలో కీలక అంశాలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు.. ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు అంశాలు పరిశీలించాలంటూ పవన్ కల్యాణ్‌కు సూచించారు హరిరామ జోగయ్య.. సీఎం వైఎస్ జగన్‌ను ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పెరిగిన నిత్యవసరవస్తువుల ధరలు, ఇతర ఛార్జీల నుంచి ఉపసమనం కలిగించేందుకు ప్రతి కుటుంబానికి రెండువేలు అందేలా చూడాలని సూచించారు. ఒకరికంటే ఎక్కువ ఉన్నా.. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా అర్హత ఉన్నవారికి వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ.నాలుగు వేలు అందేలా చేయాలన్నారు. తెల్లకార్డు కలిగిన కుటుంబాల్లోని 18 ఏళ్లు దాటిన విద్యార్ధిని, విద్యార్ధులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఉచితంగా అందించాలి.. విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ ఇవ్వాలంటూ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.
👉 – Please join our whatsapp channel here –