న్యూజెర్సీ సాయిదత్తపీఠంలో గురుపుర్ణిమ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శంకరమంచి రఘుశర్మ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు గురుపూర్ణిమ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం నాడు ప్రముఖ కళాకారుడు, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ సాయిదత్తపీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వయోలిన్ విద్వాంసుడు అశోక్ సింఘాల్ తన 15మంది విద్యార్థులతో కలిసి చేసిన వయోలిన్ ప్రదర్శన ఆకట్టుకుంది. బుధ, గురువారాల్లో ప్రత్యేక పూజలతో పాటు గురువారం సాయంత్రం పల్లకి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.
న్యూజెర్సీ సాయిదత్తపీఠంలో ఘనంగా గురుపుర్ణిమ వేడుకలు
Related tags :