2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా తలపడనుంది. ఈసారి ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 9న న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా మొదటి గేమ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది జూన్ 29న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 1 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్, 19 నుంచి జూన్ 24 వరకు సూపర్ 8, 26 నుంచి 27 వరకు సెమీఫైనల్స్ జరగనున్నాయి. కీలక ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అప్పుడే..
భారత జట్టు తన టీ20 ప్రపంచ కప్ 2024 ప్రచారాన్ని జూన్ 5న ఐర్లాండ్‌తో ప్రారంభించనుంది. ఐర్లాండ్‌తో తలపడిన తర్వాత టీమ్ ఇండియా తదుపరి పోరు పాకిస్థాన్‌తో జరగనుంది. జూన్ 9న న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత జూన్ 12న భారత జట్టు అమెరికాతో తలపడనుంది. అదే సమయంలో, జూన్ 15 న టీమిండియా తన గ్రూప్ దశలో కెనడాతో తన చివరి మ్యాచ్‌ను ఆడనుంది, ఇది ఫ్లోరిడాలో జరగనుంది.
👉 – Please join our whatsapp channel here –