Business

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రయోజనాలలో మార్పులు

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రయోజనాలలో మార్పులు

ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI) క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్‌. మీరు వాడే క్రెడిట్‌ కార్డు (Credit card) ప్రయోజనాల్లో త్వరలో మార్పులు రానున్నాయి. డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ నిబంధనల విషయంలో బ్యాంక్‌ కొన్ని మార్పులు తీసుకొస్తోంది. 21 రకాల క్రెడిట్‌ కార్డుల విషయంలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. లాంజ్‌ యాక్సెస్‌ కోసం కొత్తగా కనీస వ్యయ పరిమితిని తీసుకొస్తున్నారు. అలాగే, రివార్డు పాయింట్ల విషయంలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు హోల్డర్లు ఇకపై దేశీయ విమానాశ్రయాల్లో లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే త్రైమాసికానికి కనీసం రూ.35 వేలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఉదాహరణకు జనవరి- మార్చి నెలల్లో రూ.35వేలు ఖర్చు చేస్తే ఏప్రిల్‌ -జూన్‌ త్రైమాసికంలో లాంజ్‌ యాక్సెస్‌ పొందడానికి అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌ కోరల్‌ క్రెడిట్ కార్డ్‌ లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌ప్రెషన్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు రూ.5వేల కనీస ఖర్చు నిబంధన ఉంది.

ఏయే కార్డులకు?

* ఐసీఐసీఐ బ్యాంక్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్నారై సెక్యూర్డ్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ కోరల్‌ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ సెక్యూర్డ్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ కోరల్‌ కాంటాక్ట్‌ లెస్‌ క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్నారై కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ లీడ్‌ ద న్యూ కోరల్‌ క్రెడిట్ కార్డ్‌

* ఐసీఐసీఐ కోరల్‌ రూపే క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ మాస్టర్‌కార్డ్‌- కోరల్‌ క్రెడిట్‌ కార్డ్

* ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌ప్రెషన్‌ క్రెడిట్‌ కార్డ్‌

* మైన్‌ క్రెడిట్‌ కార్డ్‌ బై ఐసీఐసీఐ బ్యాంక్‌ వీసా కార్డ్‌

* మైన్‌ క్రెడిట్‌ కార్డ్‌ బై ఐసీఐసీఐ బ్యాంక్‌ మాస్టర్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ హెచ్‌పీసీఎల్‌ సూపర్‌ సేవర్‌ వీసా క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ హెచ్‌పీసీఎల్‌ సూపర్‌ సేవర్‌ మాస్టర్‌ క్రెడిట్‌ కార్డ్‌

* మేక్‌ మై ట్రిప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌

* చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌

* స్పీడ్జ్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ పరాక్రమ్‌ సెలక్ట్‌ క్రెడిట్ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ బిజినెస్‌ బ్లూ అడ్వాంటేజ్‌ కార్డ్‌

* ఐసీఐసీఐ బ్యాంక్‌ మేక్‌ మై ట్రిప్‌ మాస్టర్‌ బిజినెస్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌

ఇతర మార్పులు

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 1 శాతం డైనమిక్‌ కరెన్సీ కన్వర్షన్‌ ఫీజు+ ట్యాక్స్‌ను ఐసీఐసీఐ వసూలు చేయనుంది. దీని ప్రకారం.. ఇతర దేశాల్లో భారతీయ రూపాయల్లో జరిపే లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి.

రెంట్‌ పేమెంట్‌, ఈ-వ్యాలెట్‌ లోడింగ్‌లపై ఫిబ్రవరి 1 నుంచి రివార్డు పాయింట్లను ఐసీఐసీఐ బ్యాంక్‌ నిలిపివేస్తోంది. ఐసీఐసీఐ అమెజాన్‌ క్రెడిట్ కార్డుకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.

యుటిలిటీ చెల్లింపుల విషయంలోనూ ఫిబ్రవరి 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త రూల్స్‌ తీసుకొస్తోంది. యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై మునుపటిలానే రివార్డు పాయింట్లు ఇవ్వనున్నప్పటికీ.. స్టాంప్‌ డ్యూటీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పే వంటి ప్రభుత్వ చెల్లింపులను దీని నుంచి మినహాయించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z