పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపునకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం డిసెంబరు 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించిన విషయం విదితమే. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించటంతో మంచి స్పందన లభిస్తోంది. ఈ మేరకు గత నెల 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ అవకాశం మరో 5 రోజులు(10వ తేదీ వరకు) మాత్రమే ఉందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ ఎం.విశ్వప్రసాద్ తెలిపారు. వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని, చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690(వాట్సప్) నంబర్లలో సంప్రదించాలన్నారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.
👉 – Please join our whatsapp channel here –