Business

16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం డోర్

16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం డోర్

గగనతలంలో ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. టేకాఫ్ అయిన వెంటనే బోయింగ్ విమానం(flight) డోర్‌ ఊడింది. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్( emergency landing) చేశారు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన సమయంలో 16 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది.

‘AS1282 విమానం పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియో బయలుదేరిన కొద్దిసేపటికే సమస్య తలెత్తింది. దాంతో విమానాన్ని వెనక్కి మళ్లించి.. సురక్షితంగా ల్యాండ్ చేశాం. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం’ అని అలస్కా ఎయిర్‌లైన్స్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దీనిపై యూఎస్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌(ఎన్‌టీఎస్‌బీ) కూడా దర్యాప్తు ప్రారంభించింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఊడిన డోర్‌ పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి. కొందరి ఫోన్లు బయటకు ఎగిరి పడ్డాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z