Movies

రామ్‌చరణ్‌ సినిమాకు ఎ.ఆర్‌. రెహమాన్​ మ్యూజిక్?

రామ్‌చరణ్‌ సినిమాకు ఎ.ఆర్‌. రెహమాన్​ మ్యూజిక్?

రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతున్న చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని రెహమాన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం ప్రకటించింది చిత్రబృందం.క్రీడా నేపథ్య కథతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. రామ్‌చరణ్‌ మరో వినూత్నమైన పాత్రలో కనిపించనున్నారు. రామ్‌చరణ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా రెహమాన్‌కి స్వాగతం పలికారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెంకట సతీశ్‌ కిలారు నిర్మాత.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z