పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ పీజీ) జులై మొదటి వారంలో జరిగే అవకాశముంది. కౌన్సిలింగ్ ఆగస్టు మొదటి వారంలో జరగనుందని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. నేషనల్ ఎగ్జిట్ టెస్టు (నెక్స్ట్)ను ఈ ఏడాది నిర్వహించడం లేదని తెలిపాయి. 2018 పీజీ వైద్య విద్య నిబంధనలను సవరించి ఇటీవల నోటిఫై చేసిన పీజీ వైద్య విద్య నిబంధనలు-2023 ప్రకారం.. నీట్ పీజీ పరీక్ష జరగనుంది. పీజీ ప్రవేశాలకు నెక్స్ట్ అమల్లోకి వచ్చే వరకూ కొత్త నిబంధనల ప్రకారం నీట్ పీజీ జరగనుంది.
👉 – Please join our whatsapp channel here –