Movies

దిల్ రాజుకు బెదిరింపులు

దిల్ రాజుకు బెదిరింపులు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)కు బెదిరింపులు వస్తున్నాయట. హనుమాన్ సినిమాకు తక్కువ థియేటర్స్ ఇవ్వడంపై ప్రేక్షకుల నుండి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హనుమాన్ లాంటి దేవుడి సినిమాకు తక్కువ థియేటర్స్ ఇవ్వడంపై దిల్ రాజుకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వండి, లేదా లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ అల్టిమేటం జారీ చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇది నిజమేనా? లేదా రూమర్సా అనేది తెలియాలంటే దిల్ రాజు స్పందించాల్సిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z