Devotional

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

భక్తుల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. వధువుల తరఫున మహదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా, వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు స్వీకరించారు. అనంతరం బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జునుడు పెళ్లాడనున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని కొమురవెల్లి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీఎత్తున తరలివచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z