* గత ఆర్థిక సంవత్సరం కంటే తగ్గిన జీవిత బీమా సంస్థల చెల్లింపులు
కరోనా సమయంలో జీవిత బీమా కంపెనీలు ఎక్కువ డెత్ క్లెయిమ్‌ల చెల్లింపులు చేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య చాలా వరకు తగ్గింది. బీమా సెక్టార్ IRDAI విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం జీవిత బీమా పరిశ్రమ 2022-23లో చెల్లింపులు రూ. 4.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 5.02 లక్షల కోట్లుగా ఉంది. దీంతో ప్రస్తుత చెల్లింపులు సుమారు రూ. 6,000 కోట్లు తగ్గాయి.కరోనా సమయంలో బీమా కంపెనీలు డెత్ క్లెయిమ్‌ల రూపంలో రూ.60,821.86 కోట్లు చెల్లించగా, ఇది 2022-23లో రూ.19,000 కోట్లు తగ్గి రూ.41,457 కోట్లకు చేరింది. వ్యక్తిగత జీవిత బీమా విషయంలో 2022-23 ఏడాదిలో, మొత్తం 10.76 లక్షల డెత్ క్లెయిమ్‌లలో, కంపెనీలు 10.60 లక్షలకు చెల్లింపులు చేశాయి. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లు 833గా ఉన్నాయని, అలాగే, ప్రభుత్వ రంగ బీమా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి మార్చి 31, 2023 నాటికి 98.52 శాతంగా, ప్రైవేట్ బీమా సంస్థల నిష్పత్తి 2022-23లో 98.02 శాతంగా ఉందని IRDAI డేటా పేర్కొంది.
* శాంసంగ్ గెలాక్సీ ఎస్23పై ఆఫర్
టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్ (Samsung) అన్ప్యాక్డ్ ఈవెంట్ రెండు వారాల్లో (జనవరి 17) ప్రారంభం కానుంది. తన ఎస్24 సిరీస్ ఫోన్లను ఈ సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ లాంచ్ కాకముందే శాంసంగ్ తన పాత సిరీస్ ఎస్23 మోడల్ ధరల్ని తగ్గించింది.గెలాక్సీ ఎస్23 (Galaxy S23) 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.74,999కాగా.. రూ.10వేల డిస్కౌంట్‌తో రూ.64,999కే అందిస్తోంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.79,999గా పేర్కొనగా.. ప్రస్తుతం రూ.69,999కే విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో కూడిన వన్‌యూఐ 5.1తో తీసుకొచ్చారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 12 ఎంపీ కెమెరా, 3900mAh బ్యాటరీ అమర్చారు.గెలాక్సీ ఎస్23 ప్లస్ (Galaxy S23+) 8జీబీ+256 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.94,999గా కంపెనీ పేర్కొనగా.. తగ్గింపుతో రూ.84,999కే అందిస్తోంది. ఇక 8జీబీ+512 జీబీ వేరియంట్ మార్కెట్ ధర రూ.1,04,999కాగా.. రూ.94,999కే కొనుగోలు చేయొచ్చని శాంసంగ్ పేర్కొంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 12 ఎంపీ కెమెరా, 4700mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ప్రస్తుతం కార్డు ఆఫర్లేవీ అందుబాటులో లేవు. మరికొన్ని వేదికల్లో ఎక్స్ఛేంజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు సాయంతో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.2,500 తగ్గింపు ఉంటుంది. అదే యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిటీ క్రెడిట్‌కార్డు ద్వారా అయితే రూ.5 వేల డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మొత్తం రూ.15వేల వరకూ తగ్గింపుతో ఈ ఫోన్లు కొనుగోలు చేయొచ్చన్నమాట.
* టిప్స్ అక్షరాలా 97 లక్షలు
2024 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రపంచంలోని చాలా దేశ ప్రజలతో పాటు భారతీయులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ఫుడ్, డ్రింక్స్ వంటి వాటి కోసం జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌ల మీద పడ్డారు. 2023 డిసెంబర్ 31 రోజు మాత్రమే జొమాటో లెక్కకు మించిన డెలివరీలు చేసి ఏకంగా రూ. 97 లక్షల టిప్స్ పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఇండియన్ జొమాటో డెలివరీ భాగస్వాములకు కస్టమర్లు ఏకంగా రూ. 97 లక్షలకు పైగా టిప్ ఇచ్చినట్లు జోమాటో సీఈవో ‘దీపిందర్ గోయల్’ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు.దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్‌లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
* 2024లో దలాల్ స్ట్రీట్‌లో సందడి చేయడానికి వస్తున్న నాలుగు IPOలు
గత ఏడాదిలో సరికొత్త రికార్డులను నెలకొల్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు కొత్త ఏడాదిలో కూడా అదే జోష్‌ను కొనసాగిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2023లో వచ్చిన IPOలు చాలా వరకు మంచి ఫలితాలు అందించగా, ఇప్పుడు ఈ ఏడాది(2024)లో కూడా కొన్ని కంపెనీలు ప్రారంభ పబ్లిక్ ఆఫర్(IPO)కు సిద్ధమయ్యాయి. రాబోయే కొద్ది వారాల్లో నాలుగు కంపెనీలు దలాల్ స్ట్రీట్‌లో సందడి చేయడానికి వస్తున్నాయి. మొదటగా జ్యోతి CNC ఆటోమేషన్ లిమిటెడ్ కంపెనీ వస్తుంది. ఇది జనవరి 9 న మొదలై జనవరి 11 వరకు ఉంటుంది. ఒక్కో షేరుకు రూ.315-331 ధరగా నిర్ణయించారు. పబ్లిక్ ఇష్యూ ఆఫర్లో మొత్తం రూ.1,000 కోట్ల విలువైన 30,211,480 షేర్లు ఉన్నాయి.స్మాల్-మీడియం ఎంటర్ప్రైజ్ విభాగంలో , IBL ఫైనాన్స్ ప్రస్తుత సంవత్సరంలో మొదటి IPO అవుతుంది. ఇది జనవరి 9-11 వరకు ఉంటుంది. రూ.33.4 కోట్లను సమీకరించడానికి సబ్‌స్క్రిప్షన్‌ను తెచ్చారు. ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.51గా నిర్ణయించారు. మొత్తం 67.25 లక్షల షేర్లను జారీ చేస్తారు.మరో కంపెనీ న్యూ స్వాన్ మల్టీ టెక్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ జనవరి 11న ప్రారంభమై జనవరి 15న ముగుస్తుంది. ఒక్కో షేరుకు ధర రూ.62-66. ఐపీఓ ద్వారా రూ.33.11 కోట్లను సేకరించాలని చూస్తున్నారు. ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ కంపెనీ IPO జనవరి 11-15 వరకు ఉంటుంది. ఒక్కో షేరు ధర రూ. 51-54. ఇది రూ.28.08 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* విదేశాల్లో దుకాణం బంద్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో విదేశాల్లో తమ ఉనికిని క్రమంగా తగ్గించుకుంటోంది. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆస్తులు అమ్మేస్తోంది. జొమాటో వియత్నాం కంపెనీ లిమిటెడ్, పోలాండ్‌కు చెందిన గ్యాస్ట్రోనౌసీ వంటి అనుబంధ సంస్థలను లిక్విడేట్ చేస్తున్నట్లు జొమాటో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
వియత్నాం, పోలాండ్లోని తన స్టెప్-డౌన్ అనుబంధ సంస్థల కోసం ఖర్చు తగ్గించే చర్యగా రద్దు ప్రక్రియను ప్రారంభించినట్లు జొమాటో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్లో తెలియజేసింది. గురుగ్రామ్ ఆధారిత ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 2023 మార్చి నుంచి పది అనుబంధ సంస్థలను రద్దు చేసింది.2023 సంవత్సరంలో జొమాటో చిలీ ఎస్పీఏ, పీటీ జొమాటో మీడియా ఇండోనేషియా (PTZMI), జొమాటో న్యూజిలాండ్ మీడియా ప్రైవేటు లిమిటెడ్, జొమాటో ఆస్ట్రేలియా, జొమాటో మీడియా పోర్చుగల్ యూనిపెస్సోల్ ఎల్డీఏ, జొమాటో ఐర్లాండ్ లిమిటెడ్ – జోర్డాన్, చెక్ రిపబ్లిక్ లంచ్‌టైమ్, జొమాటో స్లొవేకియా వంటి వివిధ సంస్థలకు జొమాటో వీడ్కోలు పలికింది. అలాగే కెనడా, యూఎస్, ఫిలిప్పీన్స్, యూకే, ఖతార్, లెబనాన్, సింగపూర్లలోనూ జొమాటో తన అకార్యకలాపాలను నిలిపివేసింది. ఇలా అనేక దేశాల నుంచి వైదొలిగినప్పటికీ ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈలలో మాత్రం యాక్టివ్గానే ఉంది.16 ప్రత్యక్ష అనుబంధ సంస్థలు, 12 స్టెప్-డౌన్ అనుబంధ సంస్థలు, జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లింకిట్ కామర్స్, జొమాటో ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ఒక అనుబంధ కంపెనీలను జొమాటో తన 2023 వార్షిక నివేదికలో పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –