కేరళకు చెందిన సుచేతా సతీశ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. దుబాయ్‌లో గతేడాది నవంబర్ 24న జరిగిన కాప్-28 వాతావరణ సదస్సు వేదికగా 140 భాషల్లో పాటలు పాడారు. ఆమె అద్భుత ప్రదర్శనకు అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. ఆమె సంగీత నైపుణ్యం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమెకు అవార్డును బహూకరించారు. తాజాగా ఆ విషయాన్ని సుచేతా సతీశ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. కాంప్-28కి హాజరైన 140 దేశాలకు ప్రతీకగా 140 భాషల్లో పాడినట్లు ఆమె వివరించారు. ‘‘ దేవుడి దయతోనే ఈ రికార్డు సాధించాను. 9 గంటల్లో 140 భాషల్లో పాడటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నా వెన్నంటి నిలుస్తూ మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’’ అని సుచేతా పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –