Movies

టాలీవుడ్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ

టాలీవుడ్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), ‘సాహో’ ఫేమ్‌ సుజీత్‌ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (OG). గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనిని ఉద్దేశించి నటుడు వెంకట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌ అభిమానులకు ఇది తప్పకుండా నచ్చుతుందన్నారు.

‘‘ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా. హీరోగా ఇటీవల సినిమా ప్రారంభమైంది. దానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాలేదు. పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’లో కీలకపాత్ర పోషిస్తున్నా. ‘అన్నయ్య’ (చిరంజీవి సినిమా) టైమ్‌ నుంచే పవన్‌కల్యాణ్‌తో పరిచయం ఉంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత కలిసి వర్క్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. పవన్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన అభిమానులకు ఈ చిత్రం విందు భోజనం కానుంది. సుజీత్‌.. ప్రతిభ కలిగిన దర్శకుడు. ఇందులో చాలా మంది నటీనటులు ఉన్నారు. టాలీవుడ్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ’’ అని వెంకట్‌ తెలిపారు.

జపాన్‌-ముంబయి నేపథ్యంలో ‘ఓజీ’ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌ సరసన ప్రియాంకా మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z