‘‘కొన్ని పనులు నాకు అస్సలు నచ్చవు. అలాంటి వాటిలో బొప్పాయలు, అనాసలు కూడా ఉన్నాయి. నచ్చవన్నానని తినడానికి నచ్చవని అనుకునేరు. వాటిని తినడంలో నాకేం ఇబ్బంది లేదు. కానీ…’’ అని చెప్పదలచుకున్న విషయాన్ని మధ్యలో ఆపేశారు శ్రుతీ హాసన్. తినడానికి లేని సమస్య మరి దేనికుంది? అని ఆమెను అడిగితే చాలా విషయాలు వివరించారు. ఆమె మాట్లాడుతూ ‘‘నాకు బొప్పాయి, అనాస ఫ్లేవర్ పెర్ఫ్యూమ్స్ అంటే ఇష్టమని ఎవరో ఎక్కడో రాశారు. అది చదివిన చాలా మంది నాతో చాలా సార్లు వాటి గురించి ప్రస్తావించేవారు. ఫ్రెండ్స్ కొందరైతే…. ‘శ్రుతీ నీ దగ్గర ఎప్పుడూ బొప్పాయి స్మెల్ వస్తుందటగా’ అని అడిగేవారు. కొన్నాళ్లకు పెర్ఫ్యూమ్ ప్రస్తావన వస్తేనే నాకు చిరాగ్గా అనిపించేది. నిజానికి అలాంటి పెర్ఫ్యూమ్లు వేసుకునేవారు ఉండొచ్చేమో. కానీ యాక్.. నాకు మాత్రం ఆ వాసన నచ్చదు’’ అని అన్నారు శ్రుతీ.
బొప్పాయి ఫ్లేవర్…మీ బొంద
Related tags :