DailyDose

మెడికల్ అడ్మిషన్లపై NMC కొత్త మార్గదర్శకాలు

మెడికల్ అడ్మిషన్లపై NMC కొత్త మార్గదర్శకాలు

పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య ప్రవేశాలపై జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం.. దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. కోర్సుకు సంబంధించిన ఫీజును ముందే తెలపాలి. అప్పుడే ఆ సీటు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో ఉంటుంది. లేకపోతే ఆ సీటు రద్దవుతుంది. అన్ని మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్లలోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌.. ఇటీవల వెలువరించిన ‘పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య విద్య నియంత్రణలు-2023’’లో స్పష్టం చేసింది. ‘‘రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సెలింగ్‌ అథారిటీ ద్వారానే అన్ని సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సొంతంగా ఏ వైద్య కళాశాల/సంస్థ విద్యార్థులను చేర్చుకోకూడదు. సంబంధిత కోర్సు ఫీజులు ముందుగానే వైద్య కళాశాలలు తెలిపాలి. లేకపోతే ఆ సీటును లెక్కలోకి తీసుకోరు’’ అని ఎన్‌ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z