Devotional

16న శ్రీవారి పార్వేట ఉత్సవం

16న శ్రీవారి పార్వేట ఉత్సవం

ఈ నెల 16న తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవంతో పాటు సహస్రదీపాలంకార సేవలు నిర్వహించనున్నారు. అయితే ఈ సేవలను టీటీడీ రద్దు చేసింది. 16న తిరుమల శ్రీస్వామివారి పార్వేట ఉత్సవం జరగనుంది. అదే రోజున గోదాపరిణయోత్సవం కూడా నిర్వహించనున్నారు. గోదాపరిణ యోత్సవం సంద‌ర్భంగా ఆరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ మ‌ఠం నుంచి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పించనున్నారు. అనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు మలయప్పస్వామి, శ్రీ కృష్ణస్వామి పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవంతో పాటు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z