Politics

బీజేపీ నేతల మాటల్లో కేసీఆర్‌ను కాపాడాలన్న తపన

బీజేపీ నేతల మాటల్లో కేసీఆర్‌ను కాపాడాలన్న తపన

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై న్యాయ విచారణను అడ్డుకోవాలని భారాస చూస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ కాళేశ్వరంపై న్యాయ విచారణను అడ్డుకోవాలని తన మిత్రపక్షమైన భాజపాను భారాస సాయం కోరింది. జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ చాలా పారదర్శకమైంది. పారదర్శక విచారణ కోసమే ప్రభుత్వం ఆ విచారణ జరిపిస్తోంది. జ్యుడీషియల్‌ విచారణలో అవసరమైతే సీబీఐ సహాయం తీసుకోవచ్చు. భాజపా నేతల మాటల్లో కేసీఆర్‌ను రక్షించాలనే తాపత్రయం కనిపిస్తోంది’’ అని ఆయన ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z