రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ (Lagadapati Rajagopal) స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉంది. మార్గమధ్యంలో హర్షకుమార్‌ను కలిశా. ప్రజల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్‌ను విడిచిపెట్టాం. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో మేం పూర్తిగా విభేదించాం. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదు. ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తా. అవసరమైతే వారి తరఫున ప్రచారం చేస్తా. గతంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా సంతోషం’’ అని లగడపాటి వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –