Politics

ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు

ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు

ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామిన కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వాటి అమలు కోసం సబ్‌ కమిటీని వేసినట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామన్నారు. ఎన్నికల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్‌ 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలనలో రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, తదితర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలను జరిగాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z