తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం ‘ప్రజాపాలన’ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి హెచ్చరించారు. దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇటువంటి కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితులు పంపించే లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, ఓటీపీలను చెప్పవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్నీ వదలట్లేదని.. జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయే ప్రమాదముందన్నారు. ఎవరైనా ఈ విధంగా మోసపోతే వెంటనే 1930కి ఫోన్ చేయాలని, లేదంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –