తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్‌సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్‌సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని ఉం డేది. దానిని ttdevasthanams.ap.gov.in అని మా రుస్తున్నట్టు సోమవారం టీటీడీ అధికారులు ప్రకటించా రు. ‘వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యా ప్’లో భాగంగా బుకింగ్ వెబ్‌సైట్‌నూ మార్చామన్నారు.
తిరుమలలో 16న ఆర్జిత సేవలు రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16న పార్వేట, గోదాపరిణయోత్సవాల కారణంగా స్వా మివారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సంక్రాం తిని పురస్కరించుకొని తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో 14న భోగితేరు, 15న సంక్రాంతి తిరుమంజనం, 16న గోదాకల్యాణం నిర్వహిస్తారు.
👉 – Please join our whatsapp channel here –