సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆరు రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య జనవరి 10 నుంచి 15 తేదీల్లో సర్వీసులందించనున్నాయి.
ప్రత్యేక రైళ్ల వివరాలివే..
తిరుపతి – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07055) జనవరి 10వ తేదీన రాత్రి 8.25గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.
సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07056) జనవరి 11వ తేదీన రాత్రి 7గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 6.45గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే, కాకినాడ టౌన్ -సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07057) 12వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు సికింద్రాబాద్ చేసుకోనుంది.
సికింద్రాబాద్- కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07071) జనవరి 13వ తేదీన రాత్రి 9గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్ – తిరుపతి ప్రత్యేక రైలు (07072) జవనరి 14న ఉదయం 10గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి -కాచిగూడ ప్రత్యేక రైలు (02707) జనవరి 15న తెల్లవారుజామున 5.30గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.
👉 – Please join our whatsapp channel here –