మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగుదేశంలో చేరడం ఖాయమని తెలుస్తోంది. విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో గత రాత్రి తెలుగుదేశం నేతలతో పార్థసారథి సమావేశమయ్యారు. తెలుగుదేశానికి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం తెలుగుదేశం నాయకుడు బొమ్మసాని సుబ్బారావు పార్థసారథితో చర్చించారు. తెలుగుదేశంలోనికి ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈనెల 18న గుడివాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ వేదికగా పార్థసారథి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
అయితే వైఎస్సార్సీపీ నియోజకవర్గల సమన్వయకర్తల మార్పు ప్రక్రియపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనతో నేరుగా వైఎస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన అసంతృప్తిని వీడలేదు. ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంప్రదించినా సంధి కుదరలేదు. ఈ క్రమంలోనే పార్థసారథితో టీడీపీ నేతలు సమావేశమయ్యారు.
👉 – Please join our whatsapp channel here –