మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అన్ని థియేటర్లలో టికెట్‌పై రూ. 50 పెంచుకునే వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులపాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్‌లలో రూ.65, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచేందుకు వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది.
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు- దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. రమణ పాత్రలో మహేశ్ సందడి చేయనున్నారు. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి.
👉 – Please join our whatsapp channel here –