Politics

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి ఖాయమైనట్లేనా?

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి ఖాయమైనట్లేనా?

పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ స్థానంలో ఈసారి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీ నారాయణ పోటీ చేస్తారని, దీనిలో ఎటువంటి మార్పు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు. ఆ నియోజకవర్గ సమన్వయ కమిటీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం ఉదయం ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతోపాటు పెద్ద సంఖ్యలో నియోజకవర్గ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దివంగత టీడీసీ సీనియర్‌ నేత డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు తనయుడు డాక్టర్‌ కోడెల శివరాం ఈసారి సత్తెనపల్లి టిక్కెట్టు తనకే రాబోతోందని ప్రచారం చేపట్టడంతో స్థానిక టీడీపీ నేతలు కొంత అయోమయానికి గురయ్యారు. ఆయనకు టికెట్టు ఖరారైందంటూ శివరాం అనుచరులు ఇటీవల టపాసులు కూడా కాల్చారు. ఈ నేపథ్యంలో ఈ అయోమయానికి తెరదించే లక్ష్యంతో ఆ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ‘దివంగత కోడెల టీడీపీలో సీనియర్‌ నేత. ఆయన పట్ల పార్టీలో అందరికీ అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయన కుటుంబానికి ఇతరత్రా అవకాశాలు తప్పక పార్టీ నాయకత్వం కల్పిస్తుంది. ఈ ఎన్నికల్లో అక్కడ ఉన్న పరిస్థితుల్లో సీటు గెలవాలన్న లక్ష్యంతో కన్నా లక్ష్మీ నారాయణను ఎంపిక చేశాం. పార్టీ కోసం పనిచేసి గెలిపించాలని శివరాంను కూడా కోరుతున్నాం. శివరాంతోపాటు అక్కడ టికెట్టు ఆశించిన నాయకులు అనేక మంది ఉన్నారు. వారంతా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి మద్దతు ఇస్తున్నారు. మిగిలిన వారు కూడా కలిసి రావాలని కోరుతున్నాం’ అని అచ్చెన్నాయుడు ఈ సమావేశంలో అన్నారు.

సంక్రాంతికి సొంతూరికి చంద్రబాబు

చంద్రబాబు సంక్రాంతికి కుటుంబంతో కలిసి సొంతూరుకు వెళ్తున్నారు. పండగ సందర్భంగా ఈ నెల 14, 15 తేదీల్లో ఆయన తిరుపతి సమీపంలోని తన స్వగ్రామం నారావారిపల్లెలో గడపనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z