DailyDose

పీఆర్‌సీ కార్యాచరణ ప్రారంభం

పీఆర్‌సీ కార్యాచరణ ప్రారంభం

ఉద్యోగుల వేతన సవరణ కమిటీ(పీఆర్‌సీ) కార్యాచరణ ప్రారంభించింది. వేతన సవరణపై ఉద్యోగుల సలహాలు, సూచనలను స్వీకరించేందుకు ఒక్కో శాఖ వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. అన్ని శాఖల అధిపతులకు ఈ మేరకు పీఆర్‌సీ లేఖలు రాస్తోంది. ఆయా శాఖల్లోని ఉద్యోగుల పోస్టులెన్ని, వారి పేస్కేళ్లు, ఇతర వివరాలతో సమావేశానికి రావాలని సూచిస్తోంది. ఈ నెల 19న బీఆర్కే భవన్‌ 7వ అంతస్తులోని సమావేశ మందిరంలో నాలుగు శాఖల అధిపతులతో సమావేశాలు ఏర్పాటుచేసింది. ఆరోజు ఉదయం 11.30 గంటలకు సాగునీరు, ఆయకట్టు ప్రాంత అభివృద్ధి(క్యాడ్‌) శాఖలోని ఈఎన్సీ శాఖాధిపతి, ఉద్యోగులతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌, 12.45 గంటలకు భూగర్భ జలశాఖ, ఒంటి గంటకు రాష్ట్ర ఇంజినీరింగ్‌ పరిశోధన, ప్రయోగశాలల విభాగం ఉద్యోగులతో సమావేశాలు ఉంటాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z