టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో క్యాబిన్ తలుపు తెరిచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేశాడు. ఎయిర్ కెనడా (Air Canada) విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లాల్సిన ‘బోయింగ్ 747’ విమానం టొరంటో నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు హఠాత్తుగా క్యాబిన్ తలుపు తెరిచాడు. సిబ్బంది అతడిని అడ్డుకునే లోపే కిందకు దూకేశాడు. దీంతో తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల ఎత్తు నుంచి అతడు దూకడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎయిర్ కెనడా తన అధికారిక వైబ్‌సైట్‌లో వెల్లడించింది
సిబ్బంది అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఎలా ఉందో పేర్కొనలేదు. అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విమానం ఆరు గంటలు ఆలస్యంగా దుబాయ్‌కు బయలుదేరింది. ఇటీవల ఎయిర్ కెనడా విమానంలో 16 ఏళ్ల కుర్రాడు వింతగా ప్రవర్తించాడు. ఏకంగా తన కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. గాయపడిని వారిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
👉 – Please join our whatsapp channel here –