యంగ్ హీరో నితిన్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లో నితిన్ గాయపడ్డారని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నారు. తమ్ముడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో హీరో నితిన్ కు గాయపడ్డారని తెలుస్తోంది. నితిన్ కు గాయాలు కావడంతో షూటింగ్ ను నిలిపివేశారని తెలుస్తోంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. తమ్ముడు మూవీ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ ఓ భారీ ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్ సమయంలో నితిన్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
నితిన్ కు గాయం కావడంతో షూటింగ్ ను నిలిపివేశారట. గాయం మానడానికి దాదాపు మూడు వారం రోజుల పడుతుందని అప్పటివరకు నితిన్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని తెలుస్తోంది. ఇటీవలే నితిన్ ఎక్స్‌ట్రా – ఆర్డినరి మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.
ఎక్స్‌ట్రా – ఆర్డినరి మ్యాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య నితిన్ చేసిన సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. దాంతో ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసిమీదఉన్నడు. ఈ క్రమంలో ఇలా ప్రమాదంజరగడంతో అభిమానులు ఆందోళ చెందుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –