బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కళాశాలల్లో తనిఖీలు చేయడానికి ఉన్నత విద్యామండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో ఉన్న బీఈడీ కళాశాలల్లో తనిఖీలు చేయడానికి విద్యాహక్కుచట్టం సెక్షన్-31 ప్రకారం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ కళాశాలల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. సెక్షన్-31 ప్రకారం ఉన్నత విద్యామండలిని తనిఖీలు చేయడానికి నియమించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ తనిఖీలు చేయాలని భావిస్తే సెక్షన్-31 ప్రకారం ఏదైనా ఒక అధికారిని నియమించుకొని, చట్ట ప్రకారం తనిఖీలు చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
👉 – Please join our whatsapp channel here –