Devotional

శ్రీవారి ఆలయంలో 15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం

శ్రీవారి ఆలయంలో 15 నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం

ధనుర్మాసం ఘడియలు ఈనెల 14న ముగుస్తున్నాయని, జనవరి 15 నుంచి తిరుమల (Tirumala) లో సుప్రభాత సేవ(Suprabatha) లు పునఃప్రారంభం అవుతాయని టీటీడీ అర్చకులు వెల్లడించారు. డిసెంబరు 17న తెల్లవారుజాము 12.34 గంట‌ల‌కు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగిందని వివరించారు. జనవరి 16న ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయని వెల్లడించారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3. 33 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 15 కంపార్టుమెంట్ల (Compartments) లో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న 53,055 మంది భక్తులు దర్శించుకోగా 15,157 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income) రూ. 3.33 కోట్లు వచ్చిందని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z