క మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి. గూగుల్, ఫ్లిప్‌కార్ట్, యూనిటీ సాఫ్ట్‌వేర్, పేటీఎం, అమెజాన్ తదితర ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించగా ఇప్పుడు ఆ జాబితాలోకి దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ చేరాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రెండు కంపెనీలు ఏకంగా 11, 781 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చినట్టు పారిశ్రామికవర్గాలు తెలిపాయి. ఇందులో టీసీఎస్ 5,680 మందిపై వేటు వేయగా, ఇన్ఫీ 6,101 మందికి ఉద్వాసన పలికింది
టీసీఎస్
అక్టోబర్-డిసెంబర్ మధ్య ఉద్యోగ కోతలు: 5,680
అక్టోబర్-డిసెంబర్ మధ్య వలసల రేటు: 13.3 శాతం
డిసెంబర్ 31నాటికి సంస్థలో మిగిలిన ఉద్యోగులు: 6,03,305
ఇన్ఫోసిస్
అక్టోబర్-డిసెంబర్ మధ్య ఉద్యోగ కోతలు: 6,101
అక్టోబర్-డిసెంబర్ మధ్య వలసల రేటు: 12.9 శాతం
డిసెంబర్ 31నాటికి సంస్థలో మిగిలిన ఉద్యోగులు: 3,22,663
👉 – Please join our whatsapp channel here –