ScienceAndTech

ఆకాశ్ ఎన్‌జి క్షిపణి ప్రయోగం సక్సెస్‌

ఆకాశ్ ఎన్‌జి క్షిపణి ప్రయోగం సక్సెస్‌

కొత్త తరం ఆకాశ్‌-ఎన్‌జీ క్షిపణిని భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ పరీక్ష చేసినట్టు రక్షణ శాఖ తెలిపింది. ఎక్కువ వేగం కలిగిన మానవ రహిత గగన లక్ష్యంపై తక్కువ ఎత్తు నుంచి దీన్ని పరీక్షించినట్టు చెప్పింది.

80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఆకాశ్‌-ఎన్‌జీ ఛేదిస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌, లాంఛర్‌, బహుళ విధులు నిర్వహించే రాడార్‌, కమాండ్‌, కంట్రోల్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ పనితీరును ఈ క్షిపణి ప్రయోగం ద్వారా పరీక్షించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z