తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఆయన.. నేరుగా ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక కేసులో సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు. అనంతరం ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయాలకు వెళ్లి పూచీకత్తు, బాండ్లు సమర్పించనున్నారు. విజయవాడ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారనే విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా అక్కడకు చేరుకొని నినాదాలు చేశారు.
👉 – Please join our whatsapp channel here –